నటుడు రవితేజ ఇంట్లో విషాదం.. ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-16 07:29:34  IST  )

నటుడు రవితేజ తండ్రి మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు..

నటుడు రవితేజ ఇంట్లో విషాదం.. ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహరాజ్ రవితేజ(Ravi Teja) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రవి తండ్రి రాజ్ గోపాల్ రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. మధ్యాహ్నం రాయదుర్గం మహాప్రస్థానంలో రాజ్ గోపాల్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రవి కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) సహా పలువురు నటులు హృదయపూర్వక సానుభూతిని తెలిపారు.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) స్పందించారు. ‘‘రవితేజ తండ్రి రాజగోపాలరాజు కన్నుమూశారని తెలిసి చింతించా. రాజగోపాలరాజు(Rajagopala Raju) ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. రవితేజకి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా.’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Next Story