- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP CPM : ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్)(CPM).. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు(V. Srinivasa Rao)నే మరోసారి ఎన్నుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్)(CPM).. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు(V. Srinivasa Rao)నే మరోసారి ఎన్నుకున్నారు. నెల్లూరు(Nellure)లో 27వ ఏపీ రాష్ట్ర మహాసభ(AP CPM Meeting)ల్లో నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఆయననే తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు.. 15 మందితో నూతన కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు.. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమామహేశ్వరరావు, బలరాం, మూలం రమేష్, ఏవీ నాగేశ్వరరావులను ఎంపిక చేశారు.. వీరిలో ఏవీ నాగేశ్వరరావు (ఎన్టీఆర్ జిల్లా), బి. బలరాం (పశ్చిమ గోదావరి జిల్లా)ను కొత్తగా కార్యదర్శి వర్గంలోకి తీసుకున్నారు.. కార్యదర్శి, కార్యదర్శివర్గంతో కలిసి ఉన్న 50 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఏడుగురు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. నూతన కార్యావర్గంతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉదృతం చేసేందుకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది.






