Breaking: ఏపీ సీపీఐ(ఎం) అభ్యర్థులు ఖరారు.. జాబితా విడుదల

by Disha Web Desk 16 |
Breaking: ఏపీ సీపీఐ(ఎం) అభ్యర్థులు ఖరారు.. జాబితా విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అటు కాంగ్రెస్-సీపీఐ(ఎం) కూడా పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ మేరకు పొత్తులో భాగంగా ఏపీ సీపీఐ(ఎం) 10 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ అభ్యర్థులు ఖరారు అయ్యారు. పలు దఫాల చర్చల తర్వాత సీపీఐ (ఎం) తమ అభ్యర్థులను ప్రకటించింది.

Read More..

మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి.. వెరైటీగా చంద్రబాబు ఉగాది విషెస్



పార్లమెంట్

అరకు (ఎస్టీ) - పాచిపెంట అప్పల నర్స

అసెంబ్లీ

1. రంపచోడవరం (ఎస్టీ)- లోతా రామారావు

2. అరకు (ఎస్టీ)-దీసరి గంగరాజు

3. కురుపాం (ఎస్టీ)-మండంగి రమణ

4. గాజువాక-మరడాన జగ్గునాయుడు

5. విజయవాడ సెంట్రల్-చిగురుపాటి బాబురావు

6. గన్నవరం-కళ్లం వెంకటేశ్వరరావు

7. మంగళగిరి-జొన్నా శివశంకర్

8. నెల్లూరు సిటీ-మూలం రమేశ్

9. కర్నూలు-డి. గౌస్ దేశాయి

10. సంతనూతలపాడు (ఎస్సీ)- ఉబ్బా ఆదిలాక్ష్మి

కాంగ్రెస్‌తో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత అరకు పార్లమెంట్, 5 అసెంబ్లీ (రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు సిటీ) స్థానాలపై ఉమ్మడి అవగాహన కుదిరిందని, మిగిలిన 5 స్థానాలపై చర్చలు సాగించి నామినేషన్లలోపు ఒక అవగాహనకు రావాలని ఉభయపార్టీలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. సీపీఐ (ఎం), సీపీఐ పోటీ చేస్తున్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి అవగాహనకు వచ్చామని ఆయన చెప్పారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్చిస్టు) రాష్ట్ర కమిటీ ఆమోదించిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించినట్లు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.


Next Story

Most Viewed