Ap News: చంద్రబాబుకు ఎదురుదెబ్బలు.. ఆసక్తికరంగా లూథ్రా ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-09-26 07:30:15  IST  )

సీనియర్ న్యాయవాది లూథ్రా చేసిన మరో ట్వీట్ ఆసక్తికరంగా మారింది..

Ap News: చంద్రబాబుకు ఎదురుదెబ్బలు.. ఆసక్తికరంగా లూథ్రా ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ న్యాయవాది లూథ్రా చేసిన మరో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరఫున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఏపీ సీఐడీకి అనుకూలంగా కోర్టుల్లో తీర్పులు రావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు రిమాండ్ సమయంలో ఆయన చేసిన ట్వీట్‌ చేశారు. న్యాయం కనుచూపు మేర కనిపించడంలేదని.. ఇక కత్తి యుద్ధం చేయాల్సిందేనని ట్వీట్‌లో లూథ్రా పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు కొందరు మద్దతు పలకగా మరికొందరు వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే ఈ రోజు చంద్రబాబు క్వాష్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరిగాయి. సీఐడీ వాదనలను ఏకీభవించి తీర్పు ఇచ్చింది. దీంతో లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం ఉంటుందని, అది మన జీవితాల్లోకి కొత్త వెలుగులను మోసుకొస్తుందని ట్వీట్‌లో పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story