దారుణం... కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే చితక్కొట్టిన ఎస్సై

by Dishanational1 |
దారుణం... కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే చితక్కొట్టిన ఎస్సై
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కంప్లైంట్ చేయడానికి వెళ్లిన వ్యక్తిని ఎస్సై చితక్కొట్టాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా చిలమత్తూరుకు చెందిన వ్యక్తి పెన్షన్ విషయమై స్థానిక నేత డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ కంప్లైంటే ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు వెళితే అతడిపై ఎస్సై దాడి చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story