YCP: ప్రైవేట్​ జెట్​ నడిపిన కేతిరెడ్డి

by Veldandi saikiran |   ( Updated:2025-04-01 15:35:05.0  )
YCP: ప్రైవేట్​ జెట్​ నడిపిన కేతిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ పార్టీ కీలక నేత, ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ( Kethireddy Venkatarami Reddy) కొత్త గెటప్ లో కనిపించారు. తాజాగా... మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పైలెట్ గా (Pilot ) మారిపోయారు. హైదరాబాద్ మహానగరంలో ప్రైవేట్ జెట్ ( A private jet) నడిపారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. సొంతంగా ప్రైవేట్ జెట్ నడుపుతూ హైదరాబాద్ ( Hyderabad) ఆకాశ వీధిలో.... తేలిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. దీంతో... కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నడిపిన విమానం వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన... నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


ఓ మాజీ ఎమ్మెల్యే అయి ఉండి... ప్రైవేట్ జెట్ నడపడం చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిత్యం రాజకీయాలే కాదు అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ కూడా చేయాలని మరి కొంత మంది అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. 2019 ఎన్నికల్లో.. వైసీపీ పార్టీ ( YCP) నుంచి ధర్మవరం ( Dharamavaram ) ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఆ తర్వాత.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో.. తన నియోజకవర్గంలోని ప్రతి గల్లీ ఉదయం పూట తిరిగేవారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... కూటమి గాలికి కొట్టుకుపోయారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే తన ఓటమిని అంగీకరించని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఎన్నికల అయిన తర్వాత పెద్ద పోరాటమే చేశారు. ఏపీ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని, ఈవీఎం మిషన్ ద్వారా కాకుండా..బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మొన్నటి వరకు తన నిరసన కూడా తెలిపారు.



Next Story

Most Viewed