కమ్యూనిస్ట్ కోసం కాంగ్రెస్ త్యాగం.. ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లంటే

by Disha Web Desk 3 |
కమ్యూనిస్ట్ కోసం కాంగ్రెస్ త్యాగం.. ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లంటే
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) తో కలిసి అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సీపీఐ కార్యదర్శి శ్రీరామకృష్ణతో వసరుస సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు సీట్ల పంపకంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అధికారికంగా ఓ ప్రకటన జారీ చేశారు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని అలానే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను సీపీఐకి కేటాయించేలా ఒప్పందం కుదిరిందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఇక ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నియోజవర్గం నుండి సీపీఐ పోటీ చేయనుంది. అలానే విజయవాడ వెస్ట్, విశాఖపట్నం వెస్ట్, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం అసెబ్లీ సీట్లు కూడా సీపీఐకి కేటాయించినట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు.

Next Story