- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బారికేడ్లు తోసేస్తూ అంబటి రాంబాబు హల్‌చల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పల్నాడు జిల్లా ( Palnadu District )

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పల్నాడు జిల్లా ( Palnadu District ) పర్యటనలో కీలక సంఘటనలు జరిగాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఒక వృద్ధుడు మరణించగా.. తాజాగా ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu) చేసిన రచ్చ ఇప్పుడు వైరల్ గా మారింది. పోలీసులతో గొడవపడ్డ... వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు... కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. ప్రతిచోట బారీకేడ్లు పెట్టు మరి వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. చెదురు మదురు గొడవలు జరిగాయి. ముఖ్యంగా కంటేపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు... రెచ్చిపోయారు.
తన వాహనంలో నుంచి దిగి బారీకేడ్లను తొలగించాలని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు అంబటి రాంబాబు. పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టేశారు. దీంతో అంబటి రాంబాబు వర్గీయులు, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు.... పోలీసులు చాలా కష్టపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
twitter link
పోలీసు ఎదుటే మాజీ @AmbatiRambabu
— greatandhra (@greatandhranews) June 18, 2025
ను నెట్టేసిన గుర్తు తెలియని వ్యక్తి pic.twitter.com/b4SmxxUKv4






