ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు.. నాలుగో రోజు విచారణ.. నిందితుడు సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-26 08:01:42  IST  )

విజయనగరం(Vijayanagaram) ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు.. నాలుగో రోజు విచారణ.. నిందితుడు  సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విజయనగరం(Vijayanagaram) ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సమీర్, సిరాజ్‌లు పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితులను సమీర్, సిరాజ్‌ను గత మూడు రోజులుగా ఎన్ఐఏ అధికారులు(NIA officials) కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) కూడా విజయనగరం పోలీస్ శిక్షణ కాలేజీలో వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ చేపట్టిన విచారణలో కేసు నిందితుల నుంచి అధికారులు కీలక విషయాలు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు.

విచారణలో భాగంగా సిరాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘పట్టుకోక పోయి ఉంటే తానేంటో చూపించే వాడినని’’ సిరాజ్ పొగరుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారించడంతో కీలక విషయాలు వెల్లడిస్తున్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. సిరాజ్, సమీర్ నుంచి స్టేట్‌మెంట్‌ను ఎన్ఐఏ అధికారులు నమోదు చేసుకున్నారు. సిరాజ్, సమీర్ సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు ఆరా తీశారు. అహీం అనే సంస్థ ద్వారా మానవ బాంబులుగా సిద్ధం చేసిన 20 మంది ఎక్కడున్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

Next Story