ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి మృతి

by Javid Pasha |

మద్యం మానాలని భార్య మందలించడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి మృతి
X

దిశ, గొలుగొండ: మద్యం మానాలని భార్య మందలించడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కేడిపేట ఎస్పై ఉపేంద్ర తెలిపారు. గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్ పురం గ్రామానికి చెందిన సరుకుండు మర్నిబాబు (49) మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యం బారిన పడటంతో పాటు రెండవ కుమార్తె వివాహం దగ్గరపడడంతో మద్యం సేవించడం మానాలని భార్య సత్యవతి తరచూ మందలించేది.

దీంతో మనస్థాపానికి గురైన భర్త మర్నిబాబు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కేడి పేట పిహెచ్సికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్ లో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు

Next Story