సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా.. కట్ చేస్తే యూపీఎస్సీలో 780 ర్యాంక్

by Disha Web Desk 12 |
సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా.. కట్ చేస్తే యూపీఎస్సీలో 780 ర్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం విడుదలైన యూపీఎస్పీ పలితాల్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఓ సీఐ అవమానించడంతో భరించలేక కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి నిన్నటి యూపీఎస్సీ పలితాల్లో 780 వ ర్యాంక్ సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి.. 2012లో డిగ్రీ చదివే సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. అనంతరం వివిధ ప్రాంతాల్లో డ్యూటీ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, రామాయపట్నం పోలీస్ స్టేషన్ డ్యూటీ చేస్తున్న సమయంలో.. అక్కడి సీఐ ఉదయ్ కృష్ణారెడ్డిని అవమానించాడు. దీంతో ఆయన 2019లో తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. సాధించాలనే తపన ఉంటే.. ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తూ.. తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 780 వ ర్యాంకు సాధించాడు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువకులకు ఉదయ్ కృష్ణారెడ్డి రోల్ మోడల్ గా మారారు.


Next Story

Most Viewed