కరోనాను అవకాశంగా మార్చుకుందాం : ఆనంద్ మహీంద్రా!

by  |
కరోనాను అవకాశంగా మార్చుకుందాం : ఆనంద్ మహీంద్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తెస్తున్న తంటా అంతాఇంతా కాదు. వంద దేశాలకు పైగా పాకిన ఈ మహమ్మారి ఇండియాలోనూ చొరబడింది. కరోనా వ్యాప్తితో ప్రపంచ మార్కెట్లు సహా దేశీయ మార్కెట్లు భారీ పతనాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు భారీగా తగ్గాయి. కరోనా వల్ల మార్కెట్లకు ఏర్పడిన సంక్షోభాన్ని ఇండియా అనుకూలంగా మార్చుకోవాలంటూ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. అదెలాగో కూడా ఆయనే వివరించారు. ట్విటర్ వేదికగా దేశీయ మార్కెట్ల భారీ పతనానికి ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘ఈరోజు మార్కెట్ల పతనాన్ని చూస్తుంటే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంలా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలని’ తెలిపారు.

దీనికోసం మూడు ప్రధాన సూచనలు ఇచ్చారు..అవి, 1. వినిమయం పెంచడమే కాకుండా ద్రవ్యలోటును అధిగమించేందుకూ, తద్వారా లాభాలను పెంచేందుకూ చమురు ధరల పతనాన్ని ప్రభుత్వం అనుకూలంగా ఉపయోగించుకోవాలి. 2. స్వచ్ఛత, పరిశుభ్రతను పెంచి పర్యాటకులను ఆకట్టుకోవాలి. అలా చేస్తే విదేశీయులు చైనాకు వెల్లకుండా ఇండియా పర్యటనకు వస్తారు. 3. అంతర్జాతీయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనల సడలింపు ఇవ్వాలి. ఇటువంటి నిర్ణయాలతో ఎక్కువగా ఇండియాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


Tags: Mahindra, Anand Mahindra, Dalal Street, Coronavirus, Covid19,China


Next Story

Most Viewed