ఆటోడ్రైవర్ ఇన్నోవేటివ్ ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా

by  |
ఆటోడ్రైవర్ ఇన్నోవేటివ్ ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. కరోనా కేసుల సంఖ్య చూస్తే.. పెద్దగా తగ్గినట్లు కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పొడగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసిన సోషల్ డిస్టెన్స్‌తోపాటు ఇతర కారణాల వల్ల పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇప్పట్లో ప్రారంభించకపోవచ్చు. ఒకవేళ ప్రయాణాలు ప్రారంభిస్తే.. అవి ఎలా ఉండాలో తెలియజేసేలా ఓ ఆటో‌డ్రైవర్ ఐడియా మార్గం చూపుతోంది. ఆ ఇన్నోవేటివ్ ఆలోచనకు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు.

లాక్‌డౌన్ ఉన్న లేకపోయినా… కరోనా పూర్తిగా తగ్గకపోయినందున సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడం, మాస్క్ వాడటం అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని వైద్యులు, శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ తరుణంలోనే చాలామంది పౌరులు తమ సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు. కొన్ని సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలు చూపిస్తూ.. అభినందనలు అందుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అలాంటి వీడియోలకు లెక్కలేదు. అలాంటి క్రియేటివ్ ఐడియాలు అన్నీ కూడా నెటిజన్ల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాయి. ఆనంద్ మహీంద్రా కూడా తన ట్విట్టర్ లో అలాంటి ఓ ఇన్నోవేటివ్ ఆలోచనతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. మరి ఆయన్ని అంతగా ఆకట్టుకున ఆ వీడియోలో ఏముందంటే..

రాజేశ్ జేజురికర్ అనే ఓ ఆటోడ్రైవర్ తన ఆటోని ఐదు కంపార్ట్‌మెంట్లలా విభజించాడు. దీనివల్ల డ్రైవర్‌తో పాటు అందులో కూర్చున్న ప్రయాణికులకు కూడా ఒకరితో మరొకరికి అస్సలు కాంటాక్ట్ ఉండదు. ఎవరి కంపార్ట్మెంట్లలో వాళ్లూ హ్యాపీగా కూర్చుని ఎలాంటి భయాలు లేకుండా ప్రయాణం సాగించవచ్చు. ‘మన దేశ పౌరుల్లో సృజనాత్మకత పుష్కలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు వెంటనే తమను తాము మార్చుకుంటారు. తమ క్రియేటివ్ ఐడియాలతో ఎప్పుడూ నన్ను ఆశ్చ్యరానికి గురి చేస్తారు. రాజేశ్ (ఆటో డ్రైవర్) ని మన కంపెనీ ఆర్ అండ్ డీ, ప్రొడక్ట్ డెవల్మెంట్ టీమ్‌లకు అడ్వైజర్‌గా తీసుకుందాం’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా రాజేశ్ ఆలోచనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

tags :corona pandemic, lockdown, social distance, journey, public travel, auto rickshaw, driver, innovative idea, anand mahindra, twitter

Next Story

Most Viewed