బెజవాడలో ‘అమరావతి వాక్’

by  |
బెజవాడలో ‘అమరావతి వాక్’
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం 300రోజులకు చేరింది. ఈ సందర్బంగా అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘అమరావతి వాక్​’ పేరిట ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న నిరసన కారులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినాదాలిచ్చారు. స్వార్థం కోసం రాజధానిని ముక్కలు చేయొద్దని డిమాండ్​ చేశారు. ర్యాలీలో పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ అమరావతి శ్మశానం కాదని, అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. రాజధానిని ముక్కలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వత్తాసు పలకడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్​నేత సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రైతుల త్యాగంతో ఏర్పడిన అమరావతి రాజధానిని కూల్చడం జగన్​రెడ్డి తరం కాదని హెచ్చరించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం గాంధీనగర్​ తాలూకా కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.


Next Story

Most Viewed