దిగ్గజ సాకర్ ఆటగాడు జినదన్ జిదానేకు కరోనా

దిశ, స్పోర్ట్స్ : స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ కోచ్, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు జినదన్ జిదానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు. ఫ్రాన్స్‌కు చెందిన జిదానే ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు రియల్ మాడ్రిడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో ఒక కోవిడ్ పేషెంటుతో సన్నిహితంగా ఉండటంతో క్వారంటైన్‌కు వెళ్లిన జిదానే అప్పుడు నెగెటివ్‌గా తేలాడు. అయినా ముందస్తు జాగ్రత్తగా రియల్ మాడ్రిడ్ క్లబ్ ట్రైనిన్ సెషన్‌కు జిదానే హాజరు కాలేదు. అయితే […]

Update: 2021-01-22 11:33 GMT

దిశ, స్పోర్ట్స్ : స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ కోచ్, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు జినదన్ జిదానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు. ఫ్రాన్స్‌కు చెందిన జిదానే ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు రియల్ మాడ్రిడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో ఒక కోవిడ్ పేషెంటుతో సన్నిహితంగా ఉండటంతో క్వారంటైన్‌కు వెళ్లిన జిదానే అప్పుడు నెగెటివ్‌గా తేలాడు. అయినా ముందస్తు జాగ్రత్తగా రియల్ మాడ్రిడ్ క్లబ్ ట్రైనిన్ సెషన్‌కు జిదానే హాజరు కాలేదు.

అయితే అనూహ్యంగా జట్టుతో ఉన్న సమయంలో అతడు కోవిడ్ పాజిటీవ్‌గా తేలడంతో మరోసారి జట్టుకు దూరమయ్యాడు. గత వారంలో అనామక జట్టు ఆల్కయానోపై రియల్ మాడ్రిడ్ ఓడిపోయింది. శనివారం రియల్ మాడ్రిడ్‌కు మరో మ్యాచ్ ఉన్నది. ఈ నేపథ్యంలో జిదానే స్థానంలో అసిస్టెంట్ కోచ్ డేవిడ్ బెట్టోనికి బాధ్యతలు అప్పగించారు. లా లిగా పాయింట్ల పట్టికలో రియల్ మాడ్రిడ్ రెండో స్థానంలో ఉన్నది. సీజన్ ప్రారంభంలో రియల్ మాడ్రిడ్ ఫార్వర్డ్ ఆటగాడు ఎడెన్ హజార్డ్, మిడ్ ఫీల్డర్ కాసిమిరో, డిపెండర్ ఎడర్ మిలిటావ్ కూడా కోవిడ్ బారిన పడటం గమనార్హం.

Tags:    

Similar News