AP News: 3.15 లక్షల మందికి వాహన మిత్ర.. జూన్ 15న అకౌంట్లలోకి నగదు

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ వాహనమిత్ర  (YSR Vahana Mitra )పథకం డబ్బులు త్వరలో లబ్ధిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. ఇప్పటికే కొత్త లబ్దిదారుల ఎంపిక పూర్తైంది. గ్రామ, వార్డు, సచివాలయాలు, రవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయాల వద్ద బుధవారం నుంచి అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు. జూన్ 3 వరకు అభ్యంతరాలను స్వీకరించనుండగా.. జూన్ 8 నాటికి లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించనున్నారు. జూన్ 15న సీఎం వైఎస్ జగన్  (YS Jagan Mohan Reddy)నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో […]

Update: 2021-05-25 21:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ వాహనమిత్ర (YSR Vahana Mitra )పథకం డబ్బులు త్వరలో లబ్ధిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. ఇప్పటికే కొత్త లబ్దిదారుల ఎంపిక పూర్తైంది. గ్రామ, వార్డు, సచివాలయాలు, రవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయాల వద్ద బుధవారం నుంచి అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు. జూన్ 3 వరకు అభ్యంతరాలను స్వీకరించనుండగా.. జూన్ 8 నాటికి లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించనున్నారు.

జూన్ 15న సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy)నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏడాది ఆటో, మ్యాక్సీ, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా ఈ డబ్బులు ఇస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్తగా 15 శాతం మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నారు.

Tags:    

Similar News