AP News:జగన్ పాలనను ప్రజలే వ్యతిరేకిస్తున్నారు:కూటమి నేతలు

జగన్ పాలనను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని దీనిపై పెద్దగా వ్యాఖ్యానించేది ఏముందని ఏఐసీసీ సభ్యుడు వి.హెచ్ హనుమంతరావు పేర్కొన్నారు.

Update: 2024-05-03 12:02 GMT

దిశ,కాకినాడ: జగన్ పాలనను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని దీనిపై పెద్దగా వ్యాఖ్యానించేది ఏముందని ఏఐసీసీ సభ్యుడు వి.హెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన ఇండియా కూటమి నేతలు కోరారు. శుక్రవారం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలకు చెందిన నేతలు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని నేతలు తెలిపారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సభ్యుడు వి.హెచ్ హనుమంతరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, మహిళలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. రైతులకు సంబంధించిన మూడు నల్ల చట్టాలను పార్లమెంట్ ఆమోదం నిమిత్తం బీజేపీ తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశా రన్నారు. దేశంలో అవినీతి పెచ్చు మీరి పోయిందని బ్యాంకులను మోసం చేసిన వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తుందన్నారు. బీజేపీ పెద్దల గురించి పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం పేదల అభివృద్ధి గురించి పనిచేస్తుందన్నారు.రూ.10 లక్షల కోట్ల రుణాలు అదానీ, అంబానీల కోసం మాఫీ చేశారన్నారు. బీజేపీ, మోడీ ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేస్తున్నారని తద్వారా దేశ రక్షణకు నామం పెడుతున్నారన్నారు.


Similar News