మరో పది రోజులే.. ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో మరో పది రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు...

Update: 2024-05-03 11:32 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో పది రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, లేనిపక్షంలో అన్ని రద్దు అవుతాయని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ దారులకు మళ్లీ ఇంటి వద్దనే నగదు అందిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘానికి మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేయడం వల్లే రాష్ట్రంలో పెన్షన్ దారులకు కష్టాలకు వచ్చాయన్నారు. ఇంటి వద్దనే అందుకోవాల్సిన పింఛన్లు.. బ్యాంకులు దగ్గర పడిగాపులు కాసి తీసుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. గతంలో పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకు అన్యాయం జరిగిందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేశామన్నారు. ఒక్క నెల ఓపిక పడితే మళ్లీ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఎవరికీ లంచాలు ఇవ్వకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి వద్దనే పింఛన్లు అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. 

Read More..

AP Politics:మూడు రాజధానుల పేరిట జగన్ మోసం:పవన్ కళ్యాణ్ 

Tags:    

Similar News