సత్యసాయి జిల్లాలో ఫైటింగ్.. 36 మంది అరెస్ట్

పోలింగ్ రోజున సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటనలపై 36 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు...

Update: 2024-05-17 15:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ రోజు చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. పరస్పరం కర్రలు, రాళ్లు, రాడ్లు, గొడ్డళ్లు, కొడవళ్లు, నాటు బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. అయితే ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మళ్లీ పునరావృత్తం కాకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక పోలింగ్ రోజున ఘటనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పలువురు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలిస్తున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురంలో పోలింగ్ రోజున రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలింగ్ బూత్ లోకి వాహనాలతో వెళ్తున్న ఓ పార్టీ ఎంపీపీని ప్రత్యర్థి పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చుసుకుంది. రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణకు కారణమైన 36 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

Read More..

ఆ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం..ఓఎన్జీసీ పైప్ లైన్ పనులు అడ్డుకున్న రైతులు 

Similar News