పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా

న్యూఢిల్లీ: కరోనా టీకా ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. తాజాగా, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రాష్ట్రాలకు సూచించింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య […]

Update: 2021-01-10 11:08 GMT

న్యూఢిల్లీ: కరోనా టీకా ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. తాజాగా, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రాష్ట్రాలకు సూచించింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్‌సీహెచ్ సలహాదారు డాక్టర్ ప్రదీప్ హల్దార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రిన్సిపల్ సెక్రెటరీలకు ఆదేశాలను జారీ చేశారు.

Tags:    

Similar News