రైతుబంధు కోసం ప్రభుత్వం మరో అవకాశం

దిశ, న్యూస్ బ్యూరో : రైతు‌బంధు దరఖాస్తుల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వానాకాలం పంటల సీజన్ సంభందించి 56,94,185 రైతుల అకౌంట్లలో రైతుబందు డబ్బులు వేశామని.. మరో 34,860 మంది రైతుల ఖాతాల వివరాలు లేనందున డబ్బులు జమ చేయలేదు అని వ్యవసాయ శాఖ ప్రధానకార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. డబ్బులు జమకాని రైతులు ఈ నెల 15 లోగ సంబంధిత […]

Update: 2020-07-12 22:39 GMT

దిశ, న్యూస్ బ్యూరో : రైతు‌బంధు దరఖాస్తుల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వానాకాలం పంటల సీజన్ సంభందించి 56,94,185 రైతుల అకౌంట్లలో రైతుబందు డబ్బులు వేశామని.. మరో 34,860 మంది రైతుల ఖాతాల వివరాలు లేనందున డబ్బులు జమ చేయలేదు అని వ్యవసాయ శాఖ ప్రధానకార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. డబ్బులు జమకాని రైతులు ఈ నెల 15 లోగ సంబంధిత మండలాల ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతా, భూమి, ఆధార్ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ ఖాతాలో రైతు‌బంధు డబ్బులు పడ్డావో లేదో e Kuber website ద్వారా తెలుసుకోవాలని
స్పష్టం చేశారు.

Tags:    

Similar News