విద్యార్థుల ముందే ఆ పని చేసిన ఉపాధ్యాయుడు.. వీడియోతో బట్టబయలైన భాగోతం
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే పిల్లల ముందు నీచానికి వడిగట్టాడు.
దిశ, వెబ్‌డెస్క్ : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే పిల్లల ముందు నీచానికి వడిగట్టాడు. ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న అతడు.. ఇది మంచి, ఇది చెడు అని విద్యార్థులకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి.. మద్యం తాగి స్కూల్‌కు వచ్చాడు. ఇక అంతటితో ఆగని ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్‌లో కూడా అదే పని చేస్తున్నాడు. ఇక అతని తీరు గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లోని పాఠశాల ఉపాధ్యాయుడు స్కూల్‌కు తాగి వచ్చిందే గాక, చదువుకుంటున్న పిల్లల ముందే బీర్ బాటిల్‌ను పెట్టాడు. అయితే అంతటితో ఆగలేదు. మరో బీర్ బాటిల్‌ను తను కూర్చున్న కూర్చీలో దాచుకునేందుకు ప్రయత్నించగా.. గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీయడంతో అది కాస్త బయటపడింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారులు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఇక అందుకు సంబంధించిన వీడియోపై డిల్లీ మహిళా కమిషన్ చైర్పర్స్న్ స్వాతి మాలి ట్విట్టర్లో స్పందించి.. ఆ టీచర్‌పై యూపీ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.