ధోనీ కారణంగా గర్ల్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన అభిమాని.. రీజన్ తెలిసి నవ్వుతారో, షాక్ అవుతారో మీ ఇష్టం..

మిస్టర్ కూల్ ధోనీకి ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రే పడిపోయాడు. మనం ఎంత చెప్పండి. ఆయన ఆడుతున్నాడంటే టీవీలు ఆన్ అవుతాయి.

Update: 2024-04-29 09:18 GMT

దిశ, ఫీచర్స్ : మిస్టర్ కూల్ ధోనీకి ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రే పడిపోయాడు. మనం ఎంత చెప్పండి. ఆయన ఆడుతున్నాడంటే టీవీలు ఆన్ అవుతాయి. లేదంటే స్కోర్ కార్డ్స్ చూస్తే సరిపోతుంది అనుకునే అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఆయన ఏ జట్టు తరపున ఆడితే.. ఆ జట్టుకే సపోర్ట్ ఇస్తారు. ప్రస్తుతం ధోనీ చెన్నై బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. తాజాగా SRH తో జరిగిన మ్యాచ్ లో ఓ అభిమాని చేసిన పని నెట్టింట వైరల్ అవుతుంది.

ధోనీ గ్రౌండ్ లో ఉండగా ప్లకార్డులు ప్రదర్శించిన ఓ యంగ్ ఫ్యాన్.. తాను గర్ల్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేశానని, ఆమె పేరులో ఏడు అక్షరాలు లేకపోవడమే కారణమని రాశాడు. కాగా ధోనీ టీషర్ట్ నంబర్ 7 కాగా ఈ సంఖ్యకు ఎంత క్రేజ్ ఉందో ఈ ఎగ్జాంపుల్ చాలు అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి ఐడియా మాకెందుకు రాలేదని కొందరు అంటుంటే.. గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకునేందుకు మంచి పాయింట్ దొరికింది అంటున్నారు ఇంకొందరు.

Similar News