కేవలం చేతి సైగలతో లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఎలా సాధ్యం? (వీడియో)

జీవితంలో అనేక విషయాలు, రోజువారీ అవసరాలు డబ్బులతో ముడిపడి ఉంటాయి. అందుకే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మానవుల ఆలోచనలు ఎక్కువగా దాని చుట్టే తిరుగుతుంటాయి.

Update: 2024-04-29 09:42 GMT

దిశ, ఫీచర్స్ : జీవితంలో అనేక విషయాలు, రోజువారీ అవసరాలు డబ్బులతో ముడిపడి ఉంటాయి. అందుకే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మానవుల ఆలోచనలు ఎక్కువగా దాని చుట్టే తిరుగుతుంటాయి. అంతేకాకుండా బాగా చదవడం, ఉపాధికోసం వెతకడం, వ్యాపారాలు, ఉద్యోగాలు చేయడం, నచ్చిన వృత్తిని, పనిని ఎంచుకొని కొనసాగించడం వంటివన్నీ డబ్బు సంపాదనలో భాగంగానే ఉంటాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ మానసిక, శారీర శ్రమ తప్పక అవసరం అవుతుంది.

కొన్ని సార్లు సరికొత్త ఆలోచనలు, ఉపాయాలు, ఆచరణ మనీ ఎర్నింగ్‌లో కాస్త ఈజీ మెథడ్‌ను క్రియేట్ చేస్తుంటాయి. మరి కొన్నిసార్లు మెథడ్ క్రియేట్ అయ్యాక ఎర్నింగ్ ఈజీ అయ్యేలా చేస్తుంటాయి. అలాంటి ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులోని వివరాల ప్రకారం.. ఒక మహిళ కేవలం చేతి సైగలతోనే నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

జీవనాధారం కోసం డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని అనుసరిస్తారు. అయితే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉంటున్న 37 ఏండ్ల అలెగ్జాండ్రా బెరోకల్ మాత్రం అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించింది. పెట్టుబడి పెట్టడానికి డబ్బుల్లేకపోయినా, ఉద్యోగం చేయకపోయినా ‘చేతి వృత్తి’నే నమ్ముకుంది. తన ముఖం, శరీరం చూపకుండా కేవలం తన చేతి సైగలతో వింత గొల్పే పనులు, విన్యాసాలు చేస్తూ, అనేక విషయాలను వివరిస్తూ లక్షలు సంపాదిస్తోంది అలెగ్జాండ్రా. ఈ కారణంగానే ఆమె ఫేమస్ ‘హ్యాండ్ మోడల్’గానూ పేరు సంపాదించుకుంది.

ఒక ప్రదేశం గురించి వివరించడం, కప్పులో కాఫీ పోయడం, చేతి వ్రేళ్లతో విన్యాసాలు ప్రదర్శించడం, పలు అంశాల గురించి చేతి సైగలతో క్రియేటివ్‌గా చెప్పడం వంటి తనలోని కళా రూపాలను అలెగ్జాండ్ర వీడియో రూపంలో పంచుకోవడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. ఆమెకు క్షణాల్లో లక్షలకొద్దీ లైకులు, వ్యూస్‌లు వస్తుంటాయి. దీంతోపాటు వైఎస్‌ఎల్, మైక్రోసాఫ్ట్, కిస్ నెయిల్స్, సెరెనా విలియమ్స్ జ్యువెల్లరీ, బ్రాండన్ బ్లాక్‌వుడ్ వంటి ఫేమస్ సంస్థలు కూడా ఆమెతో అనుబంధం కలిగి ఉంటూ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు పొందడం వంటివి చేస్తున్నాయి. ఆమెకు డబ్బు సంపాదనలో తోడూ నీడగా నిలుస్తున్నాయి. దీంతోపాటు ఆయా కంపెనీల ఉత్పత్తులకు ‘హ్యాండ్ మోడలింగ్’ చేయడం ద్వారా అలెగ్జాండ్రా మనీ ఎర్న్ చేస్తోంది. ఇప్పుడు ఆమె వార్షికాదాయం దాదాపు రూ. 25 లక్షలకు(30 వేల డాలర్లు) చేరింది.

Full View

Similar News