చనిపోయిన వారి బంగారం మనం వాడొచ్చా.. గరుడ పురాణం ఏం చెబుతుంది!

సాధారణంగా ఇంట్లో ఎవరైన మరణించినప్పుడు వారి విలువైన వస్తువులు తమ వారసులు తీసుకుంటారు

Update: 2024-05-15 12:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇంట్లో ఎవరైన మరణించినప్పుడు వారి విలువైన వస్తువులు తమ వారసులు తీసుకుంటారు. ముఖ్యంగా ఎంతో విలువైన బంగారాన్ని కూడా తీసుకుంటారు. కొంతమంది ఆ బంగారాన్ని అలాగే వాడితే.. మరికొంతమంది దాన్ని కరిగించి వేరే వస్తువుగా చేయించుకుంటారు. మరీ దీనిపై శాస్త్రం ఏం చెబుతుందో.. చనిపోయిన వారి బంగారం వేరే వ్యక్తులు వాడొచ్చా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

జ్యోతిష్యశాస్తం ప్రకారం.. చనిపోయిన వారు ఉపయోగించిన బంగారం ఇతరులు వాడకపోవడమే మంచిదట. ఎందుకంటే గోల్డ్ సూర్య గ్రహానికి సంబంధించినది. ఆ ఆభరణాలకు సూర్య శక్తి తగ్గుతుంది. కాబట్టి మరణించిన వారి బంగారం వేరే వారు వేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయట. మీ ఆరోగ్యం నుంచి ఆర్థిక పరిస్థితి కూడా నశిస్తుందట. అంతేకాకుండా మీ ఉద్యోగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మీ బిజినెస్‌లో నష్టాలు కూడా ఎదుర్కొంటారు. అంతేకాకుండా చనిపోయిన వారి బంగారం వాడితే వారి ఆత్మకు శాంతి లభించదని గరుడ పురాణం చెబుతుంది. కాగా వారి ఆత్మ ఎప్పుడూ జీవించి ఉన్న వ్యక్తులపై ఉంటుంది. అది దోషానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కావాలంటే వారి వస్తువులను గుర్తుగా ఒక చోట ఉంచుకోవడం ఏ నష్టానికి దారితీయకపోవచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 

Similar News