‘తలైవి’కి తప్పని కరోనా కష్టాలు..

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘తలైవి’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 23న రిలీజ్ చేయాలని అనుకున్నా.. కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ‘తలైవి’ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు వెల్లడించారు. […]

Update: 2021-04-10 01:51 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘తలైవి’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 23న రిలీజ్ చేయాలని అనుకున్నా.. కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ‘తలైవి’ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు వెల్లడించారు. సినిమా విడుదల లేట్ అయినా సరే.. ఆడియన్స్ నుంచి అదే ప్రేమ అందుతుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకులు కాగా.. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags:    

Similar News