ఎట్టకేలకు శృతి హాసన్‌ బ్రేకప్‌ కన్ఫామ్.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన మాజీ ప్రియుడు శాంతన్ కామెంట్స్!

హీరోయిన్ శృతి హాసన్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Update: 2024-04-30 02:35 GMT

దిశ, సినిమా: హీరోయిన్ శృతి హాసన్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి వరుస చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అయితే శృతి హాసన్ పర్సనల్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

నిత్యం వీరిద్దరు పలు చోట్ల చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. రొమాంటిక్ ఫొటోలను శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరు తమ ప్రేమను బయటపెట్టారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ అయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం శృతి హాసన్, శాంతన్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ వార్తలు జోరందుకున్నాయి. వీరిద్దరు ఇద్దరి అంగీకారంతో విడిపోయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

కానీ దీనిపై అధికారికంగా స్పందించి లేదు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ప్రియుడు శాంతన్ బ్రేకప్‌పై స్పందించాడు. యాంకర్ బ్రేకప్ గురించి ప్రశ్నించగా.. అవును నిజమే అని సమాధానమిచ్చినట్లు సమాచారం. కానీ విడిపోవడానికి గల కారణాలు ఏంటి అని అడిగితే మాత్రం.. ‘‘నన్ను క్షమించండి. నేను దానిపై మాట్లాడడానికి ఇష్టపడను’’ అంటూ ఊహించని సమాధానంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Similar News