విజయ్ దేవరకొండను మళ్లీ గెలికిన అనసూయ.. పాత లొల్లి కొత్తగా షురూ చేసిందిగా..

జబర్దస్త్ బ్యూటీ అనసూయా భరద్వాజ్ సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో హీరోయిన్‌ను చెంప దెబ్బ కొట్టడం,

Update: 2024-04-30 03:06 GMT

దిశ, సినిమా : జబర్దస్త్ బ్యూటీ అనసూయా భరద్వాజ్ సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో హీరోయిన్‌ను చెంప దెబ్బ కొట్టడం, బోల్డ్ డైలాగ్స్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిలీజ్ టైమ్‌లో డిబేట్స్ పెట్టిన అను.. రౌడీ హీరో ఫ్యాన్స్ నుంచి భారీ వ్యతిరేకతనే చూసింది. ఘోరంగా ట్రోలింగ్ ఎదుర్కొంది. అయినా సరే మధ్య మధ్యలో విజయ్‌ను టార్గెట్ చేయడం మాత్రం ఆపలేదు. ఈ మధ్య ఆ హీరోతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పినా.. మళ్లీ అదే పద్ధతి కొనసాగిస్తుంది.

విజయ్‌ దేవరకొండ, పార్వతీ తిరువొత్తు, దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా ఇయర్ రౌండప్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గత వీడియోలో పార్వతి అమ్మాయిలను హింసించడం గురించి మాట్లాడటాన్ని పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘ప్రేమను వ్యక్తం చేసేందుకు అనేక దారులున్నాయి. కొట్టడం ఒక్కటే కాదు కదా.. ఇలాంటి సీన్స్ చేసే డైరెక్టర్ల మైండ్ సెట్ మార్చలేనప్పుడు నటులే అలాంటి ప్రాజెక్ట్స్ చేయకుండా ఉంటే సొసైటీకి మేలు జరుగుతుంది’ అనే కోణంలో చెప్పుకొచ్చింది పార్వతి. ఈ వీడియోను పోస్ట్ చేసిన అనసూయ.. ఎగ్జాక్ట్‌గా తాను ఇదే చెప్పాలనుకున్నా కానీ అంత క్లియర్‌గా కన్వే చేయలేకపోయానని, అయినా సరే ఇలాంటి పద్ధతులపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపింది.

Similar News