ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న కాజల్.. కారణం అదేనా!

స్టార్ హీరోయిన్ కాజల్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. వరుస ఆఫర్స్ వస్తూ కెరీర్ పీక్స్‌లో కొనసాగుతుండగా.. ఆమె పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

Update: 2024-05-17 13:03 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. వరుస ఆఫర్స్ వస్తూ కెరీర్ పీక్స్‌లో కొనసాగుతుండగా.. ఆమె పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంది. పూర్తిగా పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం కాజల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ‘సత్యభామ’ నేడు మే 17న విడుదలైంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రీలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ వేడుకకు కాజల్ హాజరైంది.

మహిళల సమస్యలను ఇందులో చూపించినట్లు తెలపడంతో పాటుగా.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో కాజల్ లిప్స్‌కు సర్జరీ చేయించుకుందని నెట్టింట చర్చించుకుంటున్నారు. దానికి కారణం తల్లి అయ్యాక బాడీలోని మార్పుల వల్ల చేయించుకుందని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం కాజల్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Similar News