వివాదంలో చిక్కుకున్న మహేశ్ బాబు.. ఆ వీడియో తొలగించడంపై అనుమానాలు..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ సినిమాతో అలరించిన విషయం తెలిసిందే.

Update: 2024-04-29 15:48 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టింది. ఇక ప్రస్తుతం మిల్క్ బాయ్ మరో ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోయాడు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్లు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక సినిమాలతో కాకుండా మహేశ్ బాబు పలు యాడ్స్‌లో కూడా నటిస్తూ ఉంటాడు.

ప్రస్తుతం ఇండియన్ టాప్ మోస్ట్ కార్పొరేట్ బ్రాండ్స్ అన్నీ మహేష్ బాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. తమ ప్రొడక్ట్స్ కోసం కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సైతం ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాడ్స్ చేస్తున్నారు. ఇటీవల ఫ్లిప్ కార్ట్ యాడ్స్‌లో కనిపించిన మహేష్.. తాజాగా పాన్ బహార్ బ్రాండ్‌ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఈ పాన్ బహార్ బ్రాండ్‌ని ప్రమోటింగ్ చేయడంపై నెట్టింట నెగిటివిటీ స్టార్ట్ అయింది.

ఇలాంటి గుట్కా ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాటికి మహేష్ బాబు ప్రమోట్ చేయటం ఏంటని..? అసలు అలాంటి ఈవెంట్‌కు ఆయన హాజరవడంపై కూడా తప్పుపడుతూ.. ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. ఆ వీడియో ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరూ పోస్ట్ చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే.. తర్వాత ఆ వీడియో డిలీట్ అయింది. మహేశ్ బాబు టీమ్ దీనిని డిలీట్ చేయించిందో, లేక వేరే ఎవరైనా ఈ పని చేశారో అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ వీడియో మాయమవడంపై పలు అనుమానులు కూడా ఉన్నాయి.. కానీ ఫ్యాన్స్ మాత్రం వీడియో డిలీట్ కావడంతో కాస్త సంతోషిస్తు్న్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ మాత్రం తగ్గలేదు. 

Similar News