విడాకులు తీసుకున్న బుల్లితెర స్టార్ హీరోయిన్.. కారణం అదేనా?

ఈ మధ్య వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Update: 2024-05-16 09:51 GMT

దిశ, సినిమా: ఈ మధ్య వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ తన భార్యతో విడాకులు ప్రకటించిన విషయం తెల్సిందే. తమ 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు తెలిపారు. ఇక తాజాగా బుల్లితెర నటి శిరీష సైతం.. తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.

‘మొగలిరేకులు’ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిరీష బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్‌లో నటించే ఛాన్స్ అందిపుచ్చుకుంది. మొగలిరేకులు, స్వాతిచినుకులు,రాములమ్మ, మనసు మమత, కాంచన గంగ, నాతిచరామి, చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శిరీష.. నవీన్ వల్లభనేనిని పెళ్లి చేసుకుంది. కాగా ఈ జంటకు శ్రీ ఈష్ అనే బాబు కూడా ఉన్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా శిరీష తన భర్తతో విడాకులు తీసుకుంటున్న అని ఓ పోస్ట్ పెట్టింది. అందులో “నా అభిమానులు మరియు శ్రేయోభిలాషులతో నా వ్యక్తిగత అప్‌డేట్‌ను షేర్ చేస్తున్నాను.. నవీన్ మరియు నేను, ఒకప్పుడు భార్యాభర్తలం, మా నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇలాంటి సమయంలో మమ్మల్ని అర్థం చేసుకొని మాకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. విమర్శలు వద్దు. ప్రేమ, దయ పంచండి. నాకు నవీన్ పట్ల గౌరవం తప్ప మరేమీ లేదు, ప్రజల దృష్టిలో ఉన్న వ్యక్తిగా, ఈ వార్తను మీ అందరితో పంచుకోవడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. మీరు మాపై చూపించే ప్రేమకు ఎప్పుడు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


Similar News