సీఎం సంచలన నిర్ణయం.. వారి కోసం తన వ్యక్తిగత నెంబరే హెల్ప్‌లైన్‌గా ప్రకటన

ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగకూడదన్న ఉద్దేశంతో పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2022-03-17 12:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగకూడదన్న ఉద్దేశంతో పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన రెండో రోజే ప్రభుత్వంలో మార్పులు తీసుకునేందుకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన సమయంలో అధికారులు లంచం పేరుతో ఇబ్బంది పెడుతున్నట్లు గమనించిన సీఎం.. ఇకపై లంచం అడిగితే దాన్ని వీడియో/ఆడియోను రికార్డు చేసి తనకు పంపాలని ట్విట్టర్ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లో ఉంది ఆప్ ప్రభుత్వమని.. ఇకపై అవినీతి పనిచేయదని హెచ్చరించారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేస్తానని.. అది తన వ్యక్తిగత వాట్సాప్‌ నంబరే ఉంటుందని సీఎం భగవంత్ తెలిపారు.

Tags:    

Similar News