16 ఏళ్లు నిండని నటిపై ముచ్చటపడ్డాడు.. నిర్మాత బండారం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్

సీతాకోక చిలుక, శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి వంటి క్లాసిక్ చిత్రాల్ని నిర్మించిన నిర్మాత ఏడిద నాగేశ్వర రావు పదవ తరగతి ఎగ్జామ్స్ రాస్తోన్న అమ్మాయిపై ముచ్చటపడ్డాడంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.

Update: 2024-05-09 15:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీతాకోక చిలుక, శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి వంటి క్లాసిక్ చిత్రాల్ని నిర్మించిన నిర్మాత ఏడిద నాగేశ్వర రావు పదవ తరగతి ఎగ్జామ్స్ రాస్తోన్న అమ్మాయిపై ముచ్చటపడ్డాడంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. మరీ ఇంతకీ విషయం ఏంటో తెలుసుకుందాం.. అప్పట్లో డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సితార’ మంచి సక్సెస్ అందుకుంది. హీరో సుమన్ నటించిన ఈ క్రేజీ చిత్రంలో భానుప్రియ కథనాయికగా నటించింది. అయితే ఈ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా డైరెక్టర్ వంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి పలు విషయాలు పంచుకున్నారు.

‘‘హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వర రావు రాధ గురించి చెప్పారు. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఆమెను ఎందుకు పెట్టకూడదని అడిగారు. కానీ రాధ ఆ సమయంలో పదవ తరగతి పరీక్షలు రాస్తుంది. సీతాకోక చిలుక సినిమాలో కూడా రాధని తీసుకోవాలని నాగేశ్వర రావు ముచ్చటపడ్డారు. కానీ పలు కారణాల వల్ల ముచ్చెర్ల అరుణను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత సితార చిత్రంలో కూడా రాధనే అప్రోచ్ అయ్యాం. కానీ తను ఏకంగా లక్ష రూపాయలు డిమాండ్ చేసింది. బడ్జెట్ అంతగా లేకపోవడంతో చివరకు భానుప్రియను హీరోయిన్‌గా తీసుకున్నామని దర్శకుడు వంశీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.    

Similar News