మోడీ పథకాలు దేశానికి ఆదర్శం : డీకే అరుణ

తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తూ నాలుగు నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

Update: 2024-05-09 15:16 GMT

దిశ, హన్వాడ : తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తూ నాలుగు నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం హన్వాడ మండలంలోని మాదారం, వేపూరు, టంకర, హన్వాడ, గుండ్యాల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కింద 12 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు, యువతీ యువకులు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు ముద్ర లోన్లు, గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ, మూడు కోట్ల మంది కుటుంబాలకు నగరాలలో,గ్రామాలలో ఆవాస్ యోజన కింద ఇండ్ల పంపిణీ, కరోనా లాంటి కీలక సమయాల్లో యావత్ ప్రజానీకానికి ఉచిత వ్యాక్సినేషన్, కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మధ్యవర్తిత్వం లేకుండానే ప్రతి ఏటా 6,000 రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం, ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి ఒక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, వంటి ఎన్నో గ్యారంటీలను మోడీ ప్రభుత్వం సాధించి నిరూపించిందని ఆమె అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతొ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని ఆమె ఆరోపించారు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ఆమె అన్నారు. నాపై రాజకీయంగా ఎదుర్కొనలేకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే బిజెపి పార్టీకి ఓటు వేసి నరేంద్ర మోడీని గెలిపించాలని ఆమె అన్నారు.

దేశంలో నరేంద్ర మోడీ, పాలమూరులో డీకే అరుణమ్మ గెలిస్తేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. కల్వకుర్తి నుంచి వచ్చి రాజకీయాలు చేయొచ్చు కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నాకు పోటీ చేయొద్దంటూ ఒక ఆడబిడ్డపై కుట్రలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండ బుచ్చిరెడ్డి, మండల అధ్యక్షులు వెంకటయ్య, కొండ లింగం, రఘురాం గౌడ్, కిషోర్, మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు

Similar News