Krithi Shetty: చైతు మనసు తెలుసుకున్న కృతి శెట్టి..

Krithi Shetty Lauded Naga Chaitanya in Interview| డెబ్యూ మూవీ 'ఉప్పెన' సూపర్ హిట్‌‌ తర్వాత హీరోయిన్ కృతి శెట్టి కెరియర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్‌తో కలిసి నటించిన 'ది వారియర్' మూవీతో

Update: 2022-07-13 09:14 GMT

దిశ, సినిమా : Krithi Shetty Lauded Naga Chaitanya in Interview| డెబ్యూ మూవీ 'ఉప్పెన' సూపర్ హిట్‌‌ తర్వాత హీరోయిన్ కృతి శెట్టి కెరియర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్‌తో కలిసి నటించిన 'ది వారియర్' మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 14న సినిమా విడుదలవనుండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న కృతి ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగచైతన్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది ఇక్కడ ప్రశాంతత కోల్పోతామని చెప్పినట్లుగా గుర్తుచేసుకుంది. కానీ నాగ చైతన్యను ఇండస్ట్రీలో కూడా ప్రశాంతంగా ఉండవచ్చని అర్థమైందని చెప్పింది. 'చైతూ ఎంతో నిజాయితీగా ఉంటారు. ఆయనది స్వచ్ఛమైన మనసు. ఈ గుణాలే నాకు స్ఫూర్తినిస్తాయి' అంటూ వెల్లడించింది. ఇక వచ్చే నెలలో చైతన్యతో మరో సినిమా షూటింగ్ మొదలవుతుండగా.. తనతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News