Big Alert:ఎడ్‌సెట్-2024 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్‌ 2024కు సంబంధించిన మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-07 11:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్‌ 2024కు సంబంధించిన మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బీఈడీ కోర్సులో అడ్మిషన్ పొందాడానికి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ  నోటిఫికేషన్‌కి సంబంధించి మార్చి 6వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఎడ్‌సెట్-2024 దరఖాస్తు గడువు పొడింగించారు. ఎలాంటి అదనపు ఫీజు లేకుండా మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని ఓ ప్రకటనలో తెలిపారు. రూ.250 లేట్ ఫీజుతో మే 23న సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది. విద్యార్థులు పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌‌ని సందర్శించండి.

Read More...

Microsoft: హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి.. 48 ఎకరాల్లో భారీ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ 

Similar News