బిగ్ అలర్ట్:రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2024-05-23 04:10 GMT

దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ఆయా కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా అందజేశారు. రేపటి నుంచి జూన్ 3వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకై 900 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in సందర్శించండి.

Similar News