Free Entry: పర్యాటకులకు శుభవార్త.. ఆ ప్రాంతాల్లో 10 రోజులపాటు అందరికీ ఉచిత ప్రవేశం

Free Entry at all Protected monuments, museums from Aug 5 to 15 Under Azadi Ka Amrit Mahotsav| దేశవ్యాప్తంగా ఉన్న స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గొప్ప అవకాశం కల్పించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో

Update: 2022-08-04 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: Free Entry at all Protected monuments, museums from Aug 5 to 15 Under Azadi Ka Amrit Mahotsav|  దేశవ్యాప్తంగా ఉన్న స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గొప్ప అవకాశం కల్పించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా .. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో భాగంగానే తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు చార్మినార్ , గోల్కొండ కోట, ఆర్కియాలజికల్ సైట్ మ్యూజియం, వరంగల్‌లోని వరంగల్ కోట.. వీటిని సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తూ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఆగస్టు 5 నుంచి 15 వరకు ఉచిత ప్రవేశం సందర్శికులందరికీ కల్పించగా.. విదేశీయులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఓయూలో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నాం.. మా జీతం ఇప్పటికీ రూ. 7 వేలే

Tags:    

Similar News