రెండో పెళ్లి అంటూ కాబోయే భర్తపై ట్రోల్స్.. స్టార్ కిడ్ వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పలు హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

Update: 2024-04-29 04:23 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పలు హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల తేజా సజ్జా నటించిన ‘హనుమాన్’ మూవీలో కీలక పాత్రలో చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరలక్ష్మి పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఆమె పర్సనల్ విషయానికొస్తే.. ఇటీవల వరలక్ష్మి నీకోలయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకుని సడెన్ షాకిచ్చింది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నికోలయ్‌ వివరాలు బయటకు వచ్చాయి.

అతనికి ఇప్పటికే పెళ్లి జరిగి ఓ కూతురు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టడంతో అంతా వరలక్ష్మి శరత్ కుమార్ రెండో పెళ్లి వాడిని చేసుకుంటుందని నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా, వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ ప్రమోషన్స్‌లో పాల్గొని కాబోయే భర్తపై వచ్చే ట్రోల్స్ మీద స్పందించింది. ‘‘ నేను నిక్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి సెకండ్ మ్యారేజ్ అంటూ నిక్ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఆయన హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. నిక్ ఒక్కడే రెండో పెళ్లి చేసుకోవట్లేదు కదా మా నాన్న కూడా రెండు సార్లు చేసుకున్నారు.

ఆయన ఆనందంగా ఉన్నంత వరకు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. కాబట్టి మా బంధంపై వస్తున్న ట్రోల్స్‌ను నేను లెక్క చేయను. అయినా వాటన్నింటికీ నేను ఎందుకు సమాధానం చెప్పాలి? ఆ అవసరం కూడా నాకు లేదు. నాకు నిక్ మాజీ భార్య తెలుసు ఆమె వ్యక్తిత్వం నాకు నచ్చింది. నిక్ అతని కుమార్తె, పవర్లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. అతను నాకు 14 ఏళ్ల క్రితం నుంచే తెలుసు. మేము తొలిసారి మీట్ అయి.. తర్వాతే ఫ్రెండ్స్ అయ్యాం. అదే ఇటీవల ప్రేమగా మారింది. తొందరలో భార్యభర్తలుగా కూడా మారబోతున్నాము. అతను నన్ను బాగా నవ్విస్తారు. అంతేకాకుండా నా కెరీర్ విషయంలో ఫుల్ సపోర్ట్‌గా ఉంటాడు. జీవితాంతం నిక్‌తో సంతోషంగా ఉండగలను అన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ట్రోల్స్ ఎన్ని వచ్చినా సరే పట్టించుకోను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Similar News