కేసీఆర్‌పై మాజీ మంత్రి సంచలన కామెంట్స్

దిశ, నాగర్ కర్నూల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని - former minister Nagam Janardhan Reddy Sensational comments on cm kcr

Update: 2022-07-07 16:24 GMT

దిశ, నాగర్ కర్నూల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసేందుకే కొత్త పథకాలను తీసుకొస్తున్నాడని 'మన ఊరు - మనబడి' కార్యక్రమం కేవలం దోచుకోవడం కోసమే చేపడుతున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ఎన్నో వేల కోట్ల రూపాయలను లూటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు సాకు చూపి, 'మన ఊరు - మనబడి' పేరుతో మెగా కృష్ణారెడ్డి కి కాంట్రాక్టు అప్పజెప్పి మరోసారి ప్రజల డబ్బును దోచుకునేందుకు కుట్రకు పూనుకున్నారని ఆరోపించారు.

విద్యార్థులు చదివే టేబుల్స్ ధర 4 వేలు ఉంటే 12 వేల రూపాయలు ధర ఉన్నట్టు చూపి, పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా కృష్ణారెడ్డి ప్రజల సొమ్మును లూటీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కేసరి సముద్రం చెరువు కట్ట ఆహ్లాదం కోసమే నిర్మిస్తున్నారు తప్ప.. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. ఆయకట్టును బాగు చేయాలన్న ధ్యాస మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్ట సుందరీకరణ కోసం 17 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఆయకట్టుకు నీటినందించేందుకు చర్యలు తీసుకోవడంలో వెనుకబడ్డారని మండిపడ్డారు. రైతుల కోసం తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారిందని.. వెంటనే 'ధరణి పోర్టుల్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

Similar News