Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ: CM Jagan

AP CM Jagan Disburse Interest free loan to 3.95 Lakh Vendors Under Jagananna Thodu Scheme| చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏపీ సీఎం జగన్ రూ,10వేలు చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 3.95 లక్షల మందికి రూ.395 కోట్లు వడ్డీ లేని

Update: 2022-08-03 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: AP CM Jagan Disburse Interest free loan to 3.95 Lakh Vendors Under Jagananna Thodu Scheme| చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏపీ సీఎం జగన్ రూ,10వేలు చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 3.95 లక్షల మందికి రూ.395 కోట్లు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80శాతం మంది మహిళలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని కొయాడారు. గత ప్రభుత్వంలా కాకుండా ఎక్కడా అవినీతి లేకుండా నేరుగా ప్రజలకే సంక్షేమాలు అందుతున్నాయని తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసిన తరువాతే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం వడ్డీలేని రుణాలును అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 15,03,558 మంది లబ్ధిదారులకు వడ్డీ లేకుండా రూ.2,011 కోట్లు రుణాలు అందించామని పేర్కొన్నారు.. లంచం అన్న మాట లేకుండా బటన్ నొక్కి నేరుగా డబ్బులను ప్రజలు బ్యాంక్ ఖాతాల్లోకి జమచేయడం జరిగిందన్నారు. గతంలో ప్రజలకు అందించాల్సిన డబ్బును కూడా టీడీపీ నేతలు దోచుకో దాచుకో అన్నట్టుగా వ్యవహరించారిని జగన్ ఆరోపించారు. 

Koo App
క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమం. చిరు వ్యాపారులకు, సంప్రదాయ, చేతివృత్తి కళాకారులకు రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాల పథకం వరుసగా ఐదోసారి అమలు. కొత్తగా సుమారు 3.95 లక్షలమందికి రూ. 395 కోట్ల వడ్డీలేని రుణాలు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేసిన సీఎం. గత ఆరునెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీని కూడా విడుదలచేసిన సీఎం. ఇప్పటివరకూ ఈ పథకం కింద 15,03,558 లక్ష లమందికి రూ.2,011 కోట్ల వడ్డీలేని రుణాలు. #CMYSJagan #AndhraPradeshCM - CMO AndhraPradesh (@AndhraPradeshCM) 3 Aug 2022

ఇది కూడా చదవండి: చేతగాని తనం వల్లే గ్యాస్ లీక్ ఘటనలు: సోము వీర్రాజు

Tags:    

Similar News