ఎండల ఎఫెక్ట్: ఇద్దరు మృతి.. ఇకనైన అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి.

Update: 2024-04-27 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. సగానికి పైగా జిల్లాల్లో వడగాల్పులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనాలు బయటికెళ్దామంటే జంకుతున్నారు. పలు చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలతో సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు. దేశంలోనే అత్యధికంగా కొత్తగూడెంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా వడదెబ్బతో నిన్న తెలంగాణలో ఇద్దరు మృతి చెందారు. మరో వారం పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజులు తెలంగాణలో తీవ్రవడగాలులు వీచనున్నాయి. దీంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 183 మండలాల్లో వడగాల్పులు వీయనున్నట్లు వెల్లడించింది.

Similar News