నల్లగొండ పార్లమెంట్‌లో వారి ఓట్లే అధికం.. ఆదరణ చూపితే గెలుపు ఈజీయేనా..?

నల్లగొండ పార్లమెంటు పరిధిలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని, లక్షల్లో మెజార్టీ సాధించడం ఖాయమని ఎవరికి వాళ్లు ధీమాతో చెబుతున్నాను.

Update: 2024-05-08 02:10 GMT

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ పార్లమెంటు పరిధిలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని, లక్షల్లో మెజార్టీ సాధించడం ఖాయమని ఎవరికి వాళ్లు ధీమాతో చెబుతున్నాను. కానీ ఇక్కడ పురుషుల ఓట్ల కంటే మహిళా సంఖ్య అధికంగా ఉంది. మహిళల ఆదరణను బట్టి విజయం వరించే అవకాశం ఉంది.

నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓట్లు 1718954 ఉన్నాయి. అందులో పురుషులు 842247, మహిళలు 876538, ఇతరుల ఓట్లు 169 ఉన్నాయి.

దేవరకొండ నియోజకవర్గం లో 328 పోలీస్ స్టేషన్లు, పురుషులు ఓట్లు 131599, మహిళ ఓట్లు 130241, ఇతరులు 18ఓట్లు కాగా మొత్తంగా 261858 ఓట్లు ఉన్నాయి.

నాగార్జున సాగర్ అసెంబ్లీలో పోలింగ్ స్టేషన్‌లు 306, పురుషులు ఓట్లు 115545, మహిళా ఓటర్లు 120229, ఇతర ఓట్లు 21 ఉన్నాయి. మొత్తం ఓట్లు 235795 ఉన్నాయి.

మిర్యాలగూడలో పోలింగ్ స్టేషన్ లు 264, పురుషులు ఓట్లు 115352, మహిళా ఒట్లు 119956, ఇతరుల ఓట్లు 26 ఉండగా మొత్తంగా 235334 ఓట్లు ఉన్నాయి.

హుజుర్ నగర్ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. పురుషులు ఓట్లు 120556, మహిళా ఓటర్లు 127109, ఇతరుల ఓట్లు 57 ఉండగా మొత్తం 247722 ఓట్లున్నాయి.

కోదాడ నియోజకవర్గంలో 296 పోలింగ్ స్టేషన్ లు ఉండగా, పురుషులు ఓట్లు 121390, మహిళా ఓట్లు128692, ఇతరుల ఓట్లు 17 కాగా మొత్తం 250099 ఓట్లున్నాయి..

సూర్యా పేట నియోజకవర్గంలో 271 పోలింగ్ స్టేషన్‌లు, పురుషులు ఓట్లు 119295, మహిళా ఓట్లు 125889, ఇతరుల ఓట్లు 17ఉన్నా యి. మొత్తం ఓట్లు 245201 ఉన్నాయి.

నల్లగొండ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు 288 ఉన్నాయి. పురుషులు ఓట్లు 118510, మహిళా ఓట్లు 124422, ఇతరుల ఓట్లు 13ఉన్నాయి. మొత్తం 242945 ఓట్లున్నాయి.

అధికంగా మహిళా ఓటర్లు..

నల్గొండ పార్లమెంట్ పరిధిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1718954 ఓట్లు ఉండగా అందులో పురుషులు 842247 ఓట్లు కాగా మహిళా ఓట్లు 876538 ఓట్లు ఉన్నాయి. అయితే మొత్తంగా మహిళా ఓట్లు 34291 అధికంగా ఉన్నాయి. మొత్తం ఏడు నియోజకవర్గాలలో దేవరకొండ నియోజకవర్గం తప్ప మిగతా ఆరింటిలోనూ మహిళా ఓట్లే అధికం. ఇది ఇలా ఉంటే 2019 ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ పరిధిలో 15,85,980 లక్షల ఓట్లు ఉండేవి.. అయితే ప్రస్తుత ఎన్నికలకు అదనంగా 1,32,974 ఓట్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పెరిగిన ఓట్లలో కూడా దాదాపు 50%శాతం మహిళల ఓట్లే ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News