పైత్యం పతకస్థాయికి చేరడంతోనే వెర్రి వేషాలు.. సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ (వీడియో)

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూనే ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అవగాహన కల్పిస్తుంటారు.

Update: 2024-05-08 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూనే ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అవగాహన కల్పిస్తుంటారు. స్టాక్ ట్రేడింగ్, డ్రగ్స్ కొరియర్ పేరిట బెదిరింపులు, మల్టిలెవర్ మార్చెటింగ్ పేరిట జరుగుతున్న మోసాలపై ట్విట్టర్ వేదికగా అవేర్‌నెస్ పెంచుతుంటారు. తాజాగా ముగ్గురు యువకులు బైక్‌పై నిర్లక్ష్యంగా నడుపుతున్న వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. ‘యూత్‌కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చిపనులు చేస్తున్నారన్నారు. కొందరు పిల్లలు ఇలా మారడానికి పరోక్షంగా వారి తల్లిదండ్రులే కారణం అని సీరియస్ అయ్యారు. వారి పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లపై ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు.  

Similar News