బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-05-08 03:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులంతా ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. కాగా, బాచుపల్లిలో గోడకూలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షంతో ఒక్క సారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. 

Read More...

చర్మం రంగును బట్టి వర్గీకరిస్తారా.. కాంగ్రెస్ నేత పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ 

Similar News