Vanama Venkateswara Rao: రాజీనామాపై దుమారం రేపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్

TRS MLA Vanama Venkateswara Rao Gives Clarity On Rumors Of His Resignation| తాను రాజీనామా చేయబోతున్నానని కొంత మంది దుష్ర్పచారం చేస్తున్నారని కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం పగటి కలలు కంటున్నారని వారి కలలు

Update: 2022-08-13 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : TRS MLA Vanama Venkateswara Rao Gives Clarity On Rumors Of His Resignation| తాను రాజీనామా చేయబోతున్నానని కొంత మంది దుష్ర్పచారం చేస్తున్నారని కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం పగటి కలలు కంటున్నారని వారి కలలు నెరవేరబోవని అన్నారు. ఐదేళ్ల పూర్తి కాలం తానే ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా నిలుస్తున్నాన్నారు. నియోజకవర్గానికి ఎక్కడో దూరంగా ఉంటూ కుట్రలు చేస్తూ దివాళ కోరు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగంగానే తాను రాజీనామా చేయబోతున్నాననే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి ప్రయత్నాలు నెరవేరవని అన్నారు.

సీఎం సర్వేలో నాకే మొగ్గు

రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాల సర్వేలు చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం చేయించిన సర్వేలో 70 శాతం మంది ప్రజలు తన పాలనపై సంతృప్తితో ఉన్నారని తేలిందని వనమా వెంకటేశ్వర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో తిరిగి పోటీ చేయబోయేది తానేనని స్పష్టం చేశారు.

కొడుకు వ్యవహారంతో డ్యామేజ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర రావు పాత్ర ఉండటంపై గతంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఎమ్మెల్యే కుమారుడు తమను ఎలా వేధింపులకు గురిచేశాడో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ బాధితుడు ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పూసగుచ్చినట్లు వివరించాడు. ఈ వ్యవహారంలో రాఘవేంద్రను టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై వనమా వెంకటేశ్వర్లు స్పందిస్తూ తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో కుట్రలు పన్ని తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌ను ఆగం చేశారని గతంలో చెప్పారు. నా కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారం త్వరలోనే బయటపెడతానని అప్పట్లో వనమా వెంకటేశ్వర్లు చేసిన కామెంట్స్ సంచలనం రేపిన సంగతి తెలింసిందే. తాజాగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని వెంకటేశ్వర్లు కామెంట్స్ చేయడం టీఆర్ఎస్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ సర్కార్‌పై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అసహనం

Tags:    

Similar News