రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. 34 కేజీల గోల్డ్, రూ.63 లక్షల క్యాష్ సీజ్..!

లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు గత నెల 16న విడుదలతోనే అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్‌తో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన

Update: 2024-04-28 17:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు గత నెల 16న విడుదలతోనే అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్‌తో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ. 104 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, లిక్కర్, డ్రగ్స్, గిఫ్టు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ఎలక్షన్ కోడ్ అమలు కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో జరిగిన పలు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో 477 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌లు, 89 స్టాటిక్ స్క్వాడ్‌ టీమ్‌లు తనిఖీలు నిర్వహిస్తున్నాయని, మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు మొత్తం 6,366 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయగా రూ. 104.18 కోట్ల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఆఫీస్ వివరించింది. పోలీసు శాఖ కాకుండా ఐటీ, ఎక్సయిజ్, జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ తదితర మొత్త, 19 విభాగాలకు చెందిన సిబ్బంది కూడా తనిఖీలు చేస్తున్నారు. వీరి సోదాల్లో కూడా నగదు, బంగారం తదితరాలు స్వాధీనమయ్యాయి. వీటి వివరాలను వెల్లడించాల్సి ఉన్నది.

మొత్తం స్వాధీనమైన వస్తువుల విలువ: రూ. 104.18 కోట్లు

ఇందులో బంగారం: 34.333 కేజీలు, వెండి 70.734 కేజీలు : విలువ రూ. 21.34 కోట్లు

లిక్కర్ విలువ: రూ. 5.38 కోట్లు

స్వాధీనమైన డ్రగ్స్ వ్యాల్యూ: రూ. 7.12 కోట్లు

గిఫ్టు వస్తువులు (ఉచితాలు): రూ. 6.92 కోట్లు

వీటిల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నవి: రూ. 88.17 కోట్లు

ఫ్లైయింగ్, స్టాటిక్ స్క్వాడ్‌లు సీజ్ చేసినవి: రూ. 16.02 కోట్లు

సరెండర్ అయిన లైసెన్సు ఆయుధాలు: 7,174

లైసెన్సు లేకుండా సీజ్ అయిన ఆయుధాలు: 14

Similar News