తెలంగాణలో పోలింగ్ సిబ్బంది పై లాఠీ ఛార్జ్.. ఎక్కడంటే..?

తెలంగాణ లోని 17 లోక్ సభ స్థానాలకు ఈ రోజు(మే 13) పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కానీ చివర్లో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ జులిపించారు.

Update: 2024-05-13 17:16 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ లోని 17 లోక్ సభ స్థానాలకు ఈ రోజు(మే 13) పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కానీ చివర్లో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ జులిపించారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పలు ప్రాంతాలకు చెందిన టీచర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఓటింగ్ ముగిసిన తర్వాత వారికి రావాల్సిన డబ్బులు తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ అందరూ ఆందోళన చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఎంతకి అదుపులోకి రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్న పోలింగ్ సిబ్బందిపై పోలీసులు లాఠీ‌ఛార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. కాగా తమకు రావలసిన డబ్బుల కోసం నిరసన తెలిపితే పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తున్నారు.


Similar News