కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తే.. బీజేపీ బడా కంపెనీలకు కొమ్ము కాస్తోంది: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజల కోసం పని చేస్తుంటే బీజేపీ మాత్రం బహుళ జాతి కంపెనీల కోసం పని చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

Update: 2024-05-23 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజల కోసం పని చేస్తుంటే బీజేపీ మాత్రం బహుళ జాతి కంపెనీల కోసం పని చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అమర్జీత్ కౌర్ సాహో కు మద్దతుగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించారు. ఈ దేశ వనరులు, సంపద ఈ దేశ ప్రజలకే చెందాలని మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, యువ నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తుండగా, ఈ దేశంలోని ఆస్తులను, వ్యవస్థలను అమ్మి కొద్ది మందికి కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. దేశంలో శాంతి, సౌభాతృత్వం వెళ్లి విరియాలని ఇండియా కూటమి ఓవైపు పోరాటం చేస్తుంటే, జాతి, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బిజెపి కూటమి ప్రయత్నిస్తుందని వివరించారు.

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి సంపద పంచాలని రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరగగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ఓబీసీ, బీసీ, ఎస్సీ ల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. దేశ ప్రజల కోసం పాంచ్ న్యాయ్ తో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ముందుకు రాగా , కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉన్నదన్నారు. ఇప్పటికే అదా నీ, అంబానీ వంటి కొద్ది మంది పెద్దలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి, రైతుల నోట్టో మట్టి కొట్టిందన్నారు. మోడీ 10 ఏళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని ఇబ్బందుల్లో నెట్టి వేశారన్నారు. మూడోసారి బీజేపీ వస్తే, దేశాన్ని కూడా అమ్మేస్తారని భట్టి విమర్శించారు. ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉన్నదని భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు.

Tags:    

Similar News