MLC Narsi Reddy: టీఆర్ఎస్ సర్కార్‌పై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అసహనం

by GSrikanth |
MLC Alugubelli Narsi Reddy Express Impatience Over TRS Government
X

దిశ, కోదాడ: MLC Alugubelli Narsi Reddy Express Impatience Over TRS Government| టీఆర్ఎస్ సర్కార్‌పై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన చెందారు. శనివారం కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షులు ధనమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్కావెంజర్లు లేక అపరశుభ్రత నెలకొందని, అంతేగాక, సహాయకులు లేకపోవడంతో హెడ్మాస్టర్లే వాటికి సంబంధించిన పనులను చేస్తున్నారని ఆయన తెలిపారు.

పాఠశాలలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సహాయకులను కూడా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రి పరిస్థితులు కూడా దారుణంగా తయారు అయ్యాయని అన్నారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేకమంది పేదవారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, దీని మూలంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో అధిక శాతం విద్యా, వైద్యానికి కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ, జిల్లా అధ్యక్షులు ధనమూర్తి, వీరారెడ్డి, అయితనబోయిన వీరబాబు, రాంబాబు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై తుపాకీతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్ (వీడియో)



Next Story

Most Viewed